: యువతపై ప్రభావం చూపే సినిమా: కరీనా

తాను నటిస్తున్న 'సత్యాగ్రహ' సినిమా యువతపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్ అంటున్నారు. ఆగస్టు 15న విడుదలవుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, మనోజ్ బాజ్ పాయ్, అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు. 'నాకు తెలిసి మనం చాలా ఉన్నతమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. సత్యాగ్రహ సినిమా సామాన్యుడి గురించి చెబుతుంది. యువతపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది' అంటూ వివరించింది కరీనా

More Telugu News