: పికాసో పెయింటింగును కాపాడుకునేశారట!
పికాసో అంటే కళాభిమానులకు చాలా మందికి తెలుసు! ఆధునిక చిత్రకళారీతులకు ఆద్యుడు అయిన ఒక అద్భుత వ్యక్తి ఆయన! ప్రపంచంలోనే అత్యంత మేధావుల్లో ఒకరుగా గుర్తింపు ఉన్న వ్యక్తి. అలాంటి పికాసో గీసిన చిత్రరాజం ఒకటి తమ దేశం దాటి వెళ్లకుండా అమెరికా కట్టుదిట్టం చేసి,స్వాధీనం చేసుకుంది. పికాసో గీసిన 'ఫ్రూట్ అండ్ బౌల్' అనే చిత్రం.. ఇప్పుడు సుమారు 60 కోట్ల కంటె ఎక్కువ విలువ చేస్తుంది. ఇది దేశం దాటే పరిస్థితి వచ్చినట్లు తెలియగానే.. అమెరికా స్పందించి.. స్వాధీనం చేసుకుంది.
గాబ్రియెలా అమాటి అనే మహిళపై ఇటలీలో ఆర్థిక నేరాల కేసులు నమోదయ్యాయి. దాంతో తన వద్ద ఉన్న ఈ విలువైన పెయింటింగ్‌తో పారిపోకుండా చూడాలని ఇటలీ అమెరికాను కోరినందున వారు చొరవ తీసుకుని స్వాధీనం చేసుకున్నారు. వారు తమ జాతీయ సంపద అనే ఉద్దేశంతో స్వాధీనం చేసుకుంటున్నారు. మనం మన మహాత్ముడి సొంత వస్తువులు దేశం దాటిపోయినా పట్టించుకోం.. మళ్లీ వెళ్లి వేలంలో పాడుకుని.. చంకలు గుద్దుకుంటూ తిరిగి తెచ్చుకునే స్థితిలో ఉన్నాం.