Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడ మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన‌ వంగవీటి రాధా

Vangaveeti Radha files nomination as Vijayawada Mayor candidate
Advertisement
  • కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన తరఫున బరిలోకి
  • భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి పత్రాల సమర్పణ
  • సీఎం, డిప్యూటీ సీఎం సహకారంతో నగరాభివృద్ధి హామీ
Advertisement
 జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (వంగవీటి రాధా) విజయవాడ మేయర్ బరిలో నిలిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఆయన ఇవాళ‌ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి తన కార్యాలయం నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ సమర్పించారు.

ఈ సందర్భంగా వంగవీటి రాధా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీల పూర్తి ఆమోదంతోనే తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. కూటమి మద్దతుతో తన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నగర ఎమ్మెల్యేల సహకారంతో విజయవాడను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

దివంగత కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా కుమారుడైన రాధా, గతంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైర్‌సీపీ, టీడీపీ వంటి పార్టీలలో పనిచేసి ఇటీవలే జనసేన పార్టీలో చేరారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడ మేయర్ పోరు ఆసక్తికరంగా మారింది. 
Advertisement
Advertisement
Vangaveeti Radha
Vijayawada Mayor Elections
Janasena Party
TDP Janasena BJP Alliance
Andhra Pradesh Local Body Elections
Vangaveeti Radhakrishna Nomination

More Telugu News