ఫ్రాన్స్ సంగీత ఉత్సవంలో హింస.. వందలాదిమంది అరెస్టు!
- దేశవ్యాప్తంగా 243 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
- మహిళలే లక్ష్యంగా సిరంజి దాడులు, లైంగిక దాడుల కలకలం
- కత్తిపోట్లు, దోపిడీలతో పలువురికి గాయాలు
- ఒక్క పారిస్‌లోనే 148 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు
ఫ్రాన్స్‌లో ఏటా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే సంప్రదాయ సంగీత ఉత్సవం ‘ఫేట్ డి లా ముసిక్’లో ఈసారి తీవ్ర హింస చోటుచేసుకుంది. జూన్ 21న జరిగిన ఈ వేడుకల్లో ఘర్షణలు, దాడులకు పాల్పడిన 243 మందిని ఫ్రాన్స్ పోలీసులు దేశవ్యాప్తంగా అరెస్ట్ చేశారు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో జనాలు వీధుల్లోకి రావడంతో భద్రత కోసం కేవలం పారిస్ నగరంలోనే దాదాపు 5,000 మంది పోలీసులను మోహరించాల్సి వచ్చింది. అక్కడ ఒక్క రోజే 148 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ వేడుకల్లో ముఖ్యంగా మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని జరిగిన సిరంజి దాడులు తీవ్ర కలకలం రేపాయి. గుంపుల్లోని ఆకతాయిలు పది మందికి పైగా బాధితులకు బలవంతంగా ఇంజక్షన్ సూదులు గుచ్చినట్లు ఫిర్యాదులు వచ్చాయి. బాధితులకు మత్తుమందులు లేదా డేట్-రేప్ డ్రగ్స్ ఏవైనా ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు టాక్సికాలజీ పరీక్షలు జరుపుతున్నారు. వీటితో పాటు రెండు చోట్ల కత్తిపోట్లు, రెండు అత్యాచారాలు, పలు లైంగిక వేధింపులు, దొంగతనాలు జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు.
1982 నుండి ప్రతి ఏటా ఫ్రాన్స్ వీధుల్లో ఉచితంగా నిర్వహించే ఈ సంగీత ఉత్సవాల్లో గతంలోనూ ఇలాంటి సామాజిక మాధ్యమాల ప్రేరేపిత సూది దాడులు జరిగాయి. ఈసారి హింస జరిగినప్పటికీ, పెద్ద ఎత్తున అల్లర్లు కాకుండా పరిస్థితిని అదుపు చేయగలిగామని, గతంతో పోలిస్తే అరెస్టుల సంఖ్య తక్కువగానే ఉందని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతిప్రతినిధులు తెలిపారు. బాధితుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.