రేపటి రోజున సమాజ సేవలో మేటి ఎవరంటే బాలకృష్ణ దానికి చిరునామాగా నిలుస్తారు: సీఎం చంద్రబాబు
- బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
- చైర్మన్ బాలకృష్ణపై ప్రశంసల వర్షం.. సమాజ సేవకు చిరునామాగా నిలుస్తారన్న సీఎం
- అమరావతిలో 1000 పడకల ఆసుపత్రి ఏర్పాటును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ప్రకటన
- బాలకృష్ణ నాయకత్వంలో సంస్థ 'అన్‌స్టాపబుల్'గా దూసుకెళుతోందని కొనియాడిన చంద్రబాబు
- తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలు నెరవేరుస్తున్నారని, ఎన్టీఆర్ కుటుంబం విశిష్టత అదేనని వ్యాఖ్య
హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రి చైర్మన్, తన బావమరిది అయిన నందమూరి బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. "మొన్నటి వరకు సినిమాల్లోనే చప్పట్లు కొట్టించుకున్న బాలకృష్ణ, రేపటి రోజున సమాజ సేవలో ఎవరు మేటి అంటే దానికి చిరునామాగా నిలుస్తారు" అని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అనుప్రియ పటేల్, పెమ్మసాని చంద్రశేఖర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనర్సింహ, సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు.
ఆసుపత్రి ఏర్పాటు వెనుక ఉన్న నేపథ్యాన్ని, తన అత్తగారైన బసవతారకం గారు క్యాన్సర్‌తో పడిన బాధను చంద్రబాబు భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో క్యాన్సర్‌ను 'రాచపుండు' అనేవారని, సరైన వైద్య సదుపాయాలు లేక ఆమె ఎంతో వేదన అనుభవించారని తెలిపారు. ఆమె మరణం తర్వాత ఎన్టీఆర్ గారు తీవ్రమైన వేదనకు గురయ్యారని, పేదలకు శాశ్వతంగా ఒక మంచి ఆసుపత్రి కట్టాలనే ఆయన ఆలోచనే ఈ సంస్థకు పునాది వేసిందని వివరించారు.
ఆనాడు ఎన్టీఆర్ గారు ప్రభుత్వం తరఫున భూమి కేటాయించినప్పటికీ, 1989లో ప్రభుత్వం మారడంతో ఆసుపత్రి నిర్మాణం ముందుకు సాగలేదని, మళ్లీ 1996-97 వరకు దానిపై దృష్టి పెట్టలేకపోయామని తెలిపారు. దివంగత కోడెల శివప్రసాదరావు, ఎన్ఆర్ఐల సహకారంతో ఈ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించామన్నారు.
"తండ్రి ఒక మొక్క నాటితే, కొడుకుగా బాలకృష్ణ బాధ్యత తీసుకుని దాన్ని ఒక మహా కల్పవృక్షంగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది" అని చంద్రబాబు కొనియాడారు. ఒకానొక దశలో సంస్థ మనుగడపైనే అనుమానాలు వచ్చినప్పుడు, 15 ఏళ్ల క్రితం బాలకృష్ణకు బాధ్యతలు అప్పగించామని, అప్పటి నుంచి ఈ వ్యవస్థను 'అన్‌స్టాపబుల్'గా ముందుకు నడిపిస్తున్నారని ప్రశంసించారు. సినిమాల్లో ఎవర్ గ్రీన్ హీరోగా, హిందూపురం ఎమ్మెల్యేగా తీరిక లేకుండా ఉన్నప్పటికీ, క్యాన్సర్ రోగుల పట్ల ఆయన చూపే కరుణ, సేవ చేయాలన్న తపనే ఈ సంస్థను ఈ స్థాయికి తీసుకొచ్చిందని అన్నారు.
ప్రారంభంలో 100 పడకలతో మొదలైన ఆసుపత్రి, నేడు 650 పడకల స్థాయికి పెరిగిందని, 250 మందికి పైగా నిపుణులైన వైద్యులతో సేవలందిస్తోందని చంద్రబాబు వివరించారు. ఏటా 3 లక్షల మందికి పైగా ఔట్ పేషెంట్లకు, 90 వేల మంది ఇన్ పేషెంట్లకు సేవలు అందిస్తూ, సంవత్సరానికి 8,000 ఆపరేషన్లు చేయడం గొప్ప విషయమన్నారు. అమరావతిలో 1000 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు బాలకృష్ణ, యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమని, దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని ప్రకటించారు.
ప్రభుత్వాలు మాత్రమే ప్రజారోగ్యాన్ని కాపాడలేవని, లాభాపేక్షతో నడిచే ప్రైవేటు ఆసుపత్రుల మధ్య, బసవతారకం వంటి లాభాపేక్ష లేని సంస్థలు (నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్) మరిన్ని రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తల్లి పేరుతో బాలకృష్ణ, తండ్రి పేరుతో భువనేశ్వరి (ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్) సేవా కార్యక్రమాలు చేయడం ఎన్టీఆర్ కుటుంబం యొక్క విశిష్టత అని పేర్కొన్నారు. డబ్బు సంపాదించే అవకాశాలున్నా, పేదలకు సేవ చేయడంలోనే వారు ఆనందాన్ని వెతుక్కుంటున్నారని అన్నారు.
బాలకృష్ణ నాయకత్వంలో రాబోయే 25 ఏళ్లలో బసవతారకం దేశంలోనే నంబర్ వన్ నాన్-ప్రాఫిట్ సంస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి పనికి విరాళాలు ఇవ్వాలనుకునే వారికి ఇది ఉత్తమ వేదిక అని సూచిస్తూ, 50వ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.