ఇంగ్లాండ్‌తో వన్డేలకు హార్దిక్ దూరం.. మళ్లీ ఫిట్నెస్ సమస్య!
- పూర్తి ఫిట్నెస్ సాధించని పాండ్య
- వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న వైనం
- క్వాడ్రిసెప్స్ గాయంతో మళ్లీ ఇబ్బంది
- 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయంపై బీసీసీఐ దృష్టి
- నితీశ్ కుమార్ రెడ్డిపై ఆశలు
భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో సెలక్షన్‌కు అందుబాటులో ఉండడంలేదని సమాచారం. 50 ఓవర్ల క్రికెట్‌కు అవసరమైన స్థాయిలో ఇంకా బౌలింగ్ చేయలేకపోతున్నాడని తెలుస్తోంది.
ఐపీఎల్ 2026లో ముంబయి ఇండయన్స్ తరఫున ఆడుతున్న సమయంలో హార్దిక్ వెన్ను నొప్పి సమస్యకు గురయ్యాడు. ఆ గాయం నుంచి కోలుకునేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఇటీవల శిక్షణలో పూర్తి 10 ఓవర్లు బౌలింగ్ చేయడంతో తిరిగి వన్డేల్లో కనిపిస్తాడనే ఆశలు పెరిగాయి.
అయితే రిహాబిలిటేషన్ దశలోనే హార్దిక్‌కు మరో సమస్య ఎదురైంది. ఈ నెల ప్రారంభంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కూ అతడు దూరమయ్యాడు. క్వాడ్రిసెప్స్ కండరాలకు గాయం కావడం వల్ల విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఫిట్నెస్ పరీక్షల్లో పెరిగిన బౌలింగ్ భారం కారణంగా ఈ గాయం వచ్చి ఉండొచ్చని తెలుస్తోంది.
బ్యాట్‌తో వేగంగా పరుగులు చేయడం, బంతితో కీలక వికెట్లు తీయడం హార్దిక్ ప్రత్యేకత. అందుకే అతడు జట్టులో ఉంటే బ్యాలెన్స్ పెరుగుతుంది. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో గాయపడిన తర్వాత కూడా భారత్ సరైన కాంబినేషన్ కోసం ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి కనిపిస్తోంది.
దక్షిణాఫ్రికాలో జరిగే 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని హార్దిక్‌ను జాగ్రత్తగా సిద్ధం చేయాలని భారత జట్టు యాజమాన్యం భావిస్తోంది. అతడిని పూర్తిగా ఫిట్‌గా ఉంచడమే ప్రధాన లక్ష్యమని ఎంపిక కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఇటీవల స్పష్టం చేశారు.
హార్దిక్ తరచూ గాయాల బారిన పడుతుండటంతో ప్రత్యామ్నాయ ఆల్‌రౌండర్ల కోసం కూడా భారత జట్టు అన్వేషిస్తోంది. యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డిపై జట్టు యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టింది. భవిష్యత్తులో హార్దిక్‌కు బ్యాకప్‌గా అతడిని తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉంది.