01 Wed 11:13 80 డాలర్ల దిగువకు చమురు.. రూపాయికి కొత్త ఊపు అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందంపై ఆశలు కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగింపు హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు మార్గం సుగమం రూపాయి విలువ 31 పైసలు పెరిగి 94.29 వద్ద ట్రేడవుతోంది ఎఫ్‌ఐఐలు తిరిగి కొనుగోళ్లకు రావచ్చని నిపుణుల అంచనా
02 Wed 11:10 ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డికి భద్రత కొనసాగింపు.. ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు ఫుడ్ కమిషన్ ఛైర్మన్ భద్రత పునరుద్ధరణపై కీలక పరిణామం సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పిన డివిజన్ బెంచ్ ఛైర్మన్ చిట్టా విజయప్రతాప్ రెడ్డికి 1+1 భద్రత కొనసాగింపు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ అంశంలో లోతైన పరిశీలన అవసరమని స్పష్టం చేసిన కోర్టు
03 Wed 11:10 మంగళగిరిలో కొత్త శోభ.. కాజ ఈస్ట్ లేక్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్ మంగళగిరి మండలం కాజలో ఈస్ట్ లేక్ పార్క్ ప్రారంభం కేంద్ర మంత్రి పెమ్మసానితో కలిసి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్ రూ.3.3 కోట్ల సెల్ కాన్ సీఎస్ఆర్ నిధులతో పార్క్ నిర్మాణం 17 ఎకరాల చెరువు చుట్టూ 1.7 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ 12,800 మొక్కలతో పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం
04 Wed 11:09 స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే పది రూపాయల మేర తగ్గిన పసిడి అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలోపేతం ప్రభావం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.51 లక్షలకు పైగా
05 Wed 10:59 పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు... వరి సాగు తగ్గించండి: తుమ్మల నాగేశ్వరరావు ఎల్‌నినో ప్రభావం వల్ల జూన్, జులై నెలల్లో వర్షాలు తగ్గే అవకాశం ఉందన్న తుమ్మల వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయడం మంచిదని సూచన ఎరువుల గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
06 Wed 10:58 వైభవ్‌తో వాగ్వాదం.. శ్రీలంక క్రికెటర్‌కు జరిమానా! వైభవ్ సూర్యవంశితో ఘర్షణకు దిగిన శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబగే అంపైర్ల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు ఐపీఎల్ ప్రదర్శనలపై వైభవ్‌ను స్లెడ్జింగ్ చేసినట్లు ఆరోపణలు సూపర్ ఓవర్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం వైభవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోని బీసీసీఐ
07 Wed 10:51 భారత్‌కు క్రిస్టోఫర్ నోలన్ రాక.. ముంబైలో 'ది ఒడిస్సీ' గ్రాండ్ ప్రీమియర్ హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారి భారత్‌కు రాక ఆయన కొత్త చిత్రం 'ది ఒడిస్సీ' ప్రీమియర్ ముంబైలో నిర్వహణ నోలన్‌తో పాటు హీరోలు మ్యాట్ డామన్, టామ్ హాలండ్ కూడా హాజరు ప్రపంచవ్యాప్తంగా జులై 17న విడుదల కానున్న 'ది ఒడిస్సీ' పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ఇది
08 Wed 10:40 నా జీవితంలో అత్యుత్తమ ఉద్యోగం అదే.. రోహిత్ ను దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది: జాంటీ రోడ్స్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించిన జాంటీ రోడ్స్ ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్ ఉద్యోగం తనకు అత్యుత్తమని వ్యాఖ్య మైదానంలో రోహిత్ సరదాగా ఉంటాడన్న జాంటీ
09 Wed 10:37 దశాబ్దాల కల సాకారం.. నిడమర్రు ఆర్వోబీకి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్ నిడమర్రులో రూ.142 కోట్ల ఆర్వోబీ నిర్మాణ పనులకు శంకుస్థాపన మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చేతుల మీదుగా పనులు ప్రారంభం దశాబ్దాలుగా ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం మంగళగిరి, అమరావతి, తాడికొండ మధ్య సులభతరం కానున్న రాకపోకలు ప్రాజెక్టు నిర్మాణంతో గణనీయంగా తగ్గనున్న ప్రయాణ సమయం
10 Wed 10:32 భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే అవుట్! భద్రతా అనుమతులు రద్దు చేయడంతో భారత్‌లో టర్కీ ఏవియేషన్ సంస్థకు భారీ నష్టం సుమారు 400 నుంచి 500 మిలియన్ డాలర్ల వ్యాపారం కోల్పోయినట్టు వెల్లడి ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాక్‌కు టర్కీ మద్దతే ఇందుకు కారణం జాతీయ భద్రత దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు టర్కీ సంస్థకు చెందిన 10,000 మంది ఉద్యోగులు ఇతర కంపెనీలకు బదిలీ