01 Mon 20:00 భారత అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన అస్త్రం.. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణి రూపకల్పన భారత సుదూర లక్ష్య ఛేదన సామర్థ్యం పెరిగిందని వెల్లడి డీఆర్‌డీఓ బృందాన్ని అభినందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
02 Mon 19:54 అంటార్కిటికాలో ఫ్రాన్స్ దేశం అంత మంచు పలక అదృశ్యం! అంటార్కిటిక్ ద్వీపకల్పంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు హిమానీనదాలకు రక్షణగా ఉండే మంచు లేకపోవడంతో పెరిగిన ప్రమాదం పెంగ్విన్‌లు, ఇతర సముద్ర జీవుల మనుగడకు ముప్పుగా మారిన పరిణామం
03 Mon 19:51 ఐవీఎఫ్ లో పిండాలు తారుమారు.. మా జీవితాలు నాశనమయ్యాయి: గురుగ్రామ్ దంపతుల ఆవేదన గురుగ్రామ్‌లో IVF చికిత్సలో పిండాలు తారుమారు పుట్టిన కవలలకు DNA టెస్ట్ చేయించగా, తమ పిల్లలు కాదని నిర్ధారణ మూడు నెలలుగా న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న దంపతులు మానసికంగా కుంగిపోయి, తీవ్ర ఆవేదనలో ఉన్నామంటున్న కుటుంబం కోర్టు ఆదేశాలతో ఆసుపత్రి నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు
04 Mon 19:38 యంగ్ సెన్సేషన్ అనిరుధ్ నుంచి కొత్త ప్రయోగం.. ‘అరవింద్’తో ఇండిపెండెంట్ మ్యూజిక్‌కు శ్రీకారం ‘అరవింద్’ పాట విడుదల చేసిన అనిరుధ్ అల్బుకర్కీ రికార్డ్స్‌కు శ్రీకారం యూనివర్సల్ మ్యూజిక్‌తో తొలి ప్రాజెక్ట్ స్వతంత్ర కళాకారుడి పోరాట కథ తన జీవితానికి దగ్గరగా ఉందన్న అనిరుధ్
05 Mon 19:11 'బారామాసి' మామిడి మొక్కలు.. బాల్కనీలో పెంచుకోవచ్చు.. నాటిన ఏడాదికే కాపు! పట్టణాల్లో బాల్కనీలు, డాబాలపై బారామాసి మామిడి మొక్కల పెంపకం ఏడాది పొడవునా కాపునివ్వడమే ఈ రకాల ప్రధాన ఆకర్షణ నాటిన 12 నెలల్లోనే ఫలసాయం అందించే హైబ్రిడ్ వెరైటీలు కుండీల్లో పెంచడానికి అనువైన కాటిమోన్, సదాబహార్ రకాలకు ఆదరణ తీపి రుచి, పీచులేని గుజ్జుతో ఈ పండ్లు ప్రత్యేకం
06 Mon 19:01 ‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ పెద్ద హిట్ కావాలి: నిహారిక కొణిదెల విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో వస్తున్న కొత్త చిత్రం అమ్మలోనూ అమ్మాయి ఉంటుందనే పాయింట్ అద్భుతం అన్న నిహారిక ఈ కథ వినగానే కన్నీళ్లు ఆగలేదని చెప్పిన హీరో విజయ్ ఆంటోని జూన్ 19న థియేటర్లలోకి రానున్న వంద దేవుళ్ళు
07 Mon 18:53 అన్నం వండే ముందు బియ్యం కడగడం మంచిదా? కాదా? అన్నం వండే ముందు బియ్యం కడగడంపై నిపుణుల విశ్లేషణ బియ్యం కడగడం వల్ల అదనపు పిండిపదార్థం, మైక్రోప్లాస్టిక్స్ తొలగిపోతాయి స్వల్పంగా పోషకాలు నష్టపోయే అవకాశం ఉందని వెల్లడి ఆర్సెనిక్ తగ్గాలంటే కడగడం కన్నా గంజి వార్చడమే ఉత్తమమని సూచన
08 Mon 18:50 టెక్నాలజీ, ఎయిర్ కనెక్టివిటీ.. సింగపూర్ పర్యటనలో చంద్రబాబు కీలక భేటీలు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తోనూ కీలక సమావేశం అమరావతి సహా అర్బన్ గవర్నెన్స్‌లో సహకారం కోరిన ముఖ్యమంత్రి ఏపీ నుంచి ఆక్వా, ఉద్యాన ఉత్పత్తుల దిగుమతికి విజ్ఞప్తి సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్ కనెక్టివిటీపై ఫలవంతమైన చర్చలు
09 Mon 18:34 ఫుడ్ బ్రాండ్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా.. 'హెల్తీ', 'ఆర్గానిక్' పేర్లతో మోసమంటున్న సంస్థ తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఫుడ్ కంపెనీలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు 'హెల్తీ', 'ఆర్గానిక్', 'వేగన్' వంటి పదాలపై తీవ్ర అభ్యంతరం లేబుళ్లపై ప్రకటనలకు, ఉత్పత్తికి పొంతన లేదని ఆరోపణ సుమారు 15 సంస్థలకు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడి ఆహార భద్రతా చట్టాన్ని ఉల్లంఘించారని స్పష్టం చేసిన రెగ్యులేటర్
10 Mon 18:24 బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం... 16 ఏళ్ల లోపు వారికి 'నో సోషల్ మీడియా' 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించిన యూకే పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతే లక్ష్యమన్న ప్రధాని కీర్ స్టార్మర్ టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ సహా ప్రధాన ప్లాట్‌ఫామ్‌లకు వర్తించనున్న నిబంధనలు నిర్ణయాన్ని స్వాగతించిన స్వచ్ఛంద సంస్థలు