ఏపీతో చర్చలు జరుగుతున్నాయి.. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోం: రేవంత్ రెడ్డి
- పాలమూరు ప్రాజెక్టును సందర్శించిన రేవంత్ రెడ్డి
- ఏపీతో సమస్యల పరిష్కారికే ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి
- బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని విమర్శ
పాలమూరు ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే తెలంగాణ ప్రజలకు శుభవార్త చెబుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఏపీతో చర్చలు జరిపినా రాష్ట్ర చట్టబద్ధమైన వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాము 'పంచాయతీ' కంటే 'పరిష్కారానికే' ప్రాధాన్యత ఇస్తామని... పాలమూరు, డిండి పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ వస్తేనే మిగతా చర్చలు ముందుకు సాగుతాయని తేల్చి చెప్పారు.