జనసేన రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేసిన పవన్ కల్యాణ్?

Pawan Kalyan chooses Lingamaneni Ramesh for Rajya Sabha from Janasena quota
  • ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
  • టీడీపీ 3 స్థానాలు, జనసేన ఒక స్థానంలో పోటీ
  • చాలా కాలంగా లింగమనేని పేరును పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్
ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్డీయే కూటమి సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. టీడీపీ 3, జనసేన ఒక స్థానంలో పోటీ చేయబోతున్నాయి. ఈ మేరకు కూటమి పెద్దలు నిర్ణయాన్ని ప్రకటించారు. 

ఇక జనసేన కోటాకు దక్కిన ఆ ఒక్క రాజ్యసభ స్థానం నుంచి పార్లమెంట్‌కు వెళ్లే అభ్యర్థిని ఆ పార్టీ దాదాపు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ దాదాపు ఖరారు చేశారని, ఈ సాయంత్రమే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎవరీ లింగమనేని రమేశ్?

ఈయన ఏపీలో సుపరిచితులైన బిజినెస్ మ్యాన్. ప్రసిద్ధ 'లింగమనేని ఎస్టేట్స్', 'ఎల్ఈపీఎల్ గ్రూప్' సంస్థలకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. విమానయాన రంగంలోకి కూడా ప్రవేశించి, ప్రాంతీయ విమానయాన సంస్థ ‘ఎయిర్ కోస్టా’ను స్థాపించారు. గతంలో ఈయన టీడీపీ అధినేత చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. అయితే, చాలా కాలంగా పవన్ ఈయన పేరును రాజ్యసభ స్థానానికి పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కూటమి సీట్ల సర్దుబాటు ముగియడం, జనసేన అభ్యర్థిగా లింగమనేని పేరు దాదాపు ఖరారు కావడంతో ఏపీ రాజ్యసభ ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.



Go Back to Shorts
Pawan Kalyan
Lingamaneni Ramesh
Janasena Party
Rajya Sabha elections AP
Andhra Pradesh politics
NDA alliance AP
LEPL Group
TDP Janasena BJP alliance
Air Costa founder
Chandrababu Naidu

More Telugu News