'కొత్త సిక్సర్ల మెషిన్' వైభవ్.. కచ్చితంగా ఆ మార్కును అందుకుంటావు: క్రిస్ గేల్
- ఐపీఎల్‌లో కొత్త సిక్సర్ల రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
- ఒకే సీజన్‌లో 65 సిక్సర్లతో క్రిస్ గేల్ రికార్డు బ్రేక్
- వైభవ్ ఐపీఎల్‌కు దొరికిన కొత్త సిక్సర్ల మెషిన్ అంటూ యూనివర్సల్ బాస్ ప్రశంస
- ఎలిమినేటర్‌లో 29 బంతుల్లో 97 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్
ఐపీఎల్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ బ్యాటర్.. టీ20 క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న పలు రికార్డులను బద్దలు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)తో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. 334కు పైగా స్ట్రైక్ రేట్‌తో సాగిన ఈ ఇన్నింగ్స్‌తో అతను ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్‌లో మొత్తం 65 సిక్సర్లు కొట్టిన వైభవ్, 2012లో క్రిస్ గేల్ నెలకొల్పిన 59 సిక్సర్ల రికార్డును అధిగమించాడు. ఇది ఏ టీ20 టోర్నమెంట్‌లోనైనా ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు కావడం విశేషం.
వైభవ్ ప్రదర్శనపై క్రిస్ గేల్ స్వయంగా స్పందించి ప్రశంసలు కురిపించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులో.. "అద్భుతం వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్‌కు దొరికిన కొత్త సిక్సర్ల మెషిన్" అని అభినందించాడు. కేవలం 3 పరుగుల తేడాతో శతకం చేజార్చుకోవడంపై స్పందిస్తూ.. "నువ్వు దురదృష్టవంతుడివి. కానీ, కచ్చితంగా ఆ మార్కును అందుకుంటావు" అని ప్రోత్సహించాడు.
ఐపీఎల్‌లో కొత్త సిక్సర్ల కింగ్.. వైభవ్ సూర్యవంశీ!
ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మొత్తం 15 ఇన్నింగ్స్‌లలో 45.33 సగటు, 242.85 స్ట్రైక్ రేట్‌తో 680 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. తన పరుగుల్లో 88.9 శాతాన్ని కేవలం ఫోర్లు, సిక్సర్లతోనే సాధించి, 2019లో ఆండ్రీ రస్సెల్ (85.5%) నెలకొల్పిన రికార్డును కూడా వైభవ్ బద్దలు కొట్టాడు. అంతేగాక ఒకే ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో 10కి పైగా సిక్సర్లు బాదిన సందర్భాల్లో గేల్ (4 సార్లు) రికార్డును సమం చేయడమే కాకుండా, ఒకే సీజన్‌లో మూడుసార్లు ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభతో, వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ భవిష్యత్తుకు ఓ కొత్త ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు.