ఔటైన తర్వాతనే తెలిసింది.. ఆ రికార్డు మిస్ అయ్యానని: వైభవ్
- సన్‌రైజర్స్‌పై 29 బంతుల్లో 97 పరుగులతో విధ్వంసం సృష్టించిన వైభవ్
- త్రుటిలో ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును చేజార్చుకున్న యువ బ్యాటర్
- ఆ రికార్డు గురించి తన ఇన్నింగ్స్ ముగిసిన తర్వాతనే తెసిందన్న యువ సంచలనం
- ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్ల గేల్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో నిన్న రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్లతో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో రాజస్థాన్.. గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
ఈ కీలక పోరులో వైభవ్ సూర్యవంశీ 334.48 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ (క్రిస్ గేల్ 30 బంతుల్లో) రికార్డును కేవలం ఒక్క బంతి తేడాతో చేజార్చుకున్నాడు. అయితే, ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు (65) బాదిన బ్యాటర్‌గా క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును మాత్రం బద్దలు కొట్టాడు.
మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై స్పందించిన వైభవ్.. "ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు గురించి నాకు ఔటైన తర్వాతనే తెలిసింది. నా దృష్టి అంతా సిక్సులు కొట్టడంపైనే ఉంది. భవిష్యత్తులో సెంచరీలు చేస్తాను. కానీ జట్టు కోసం కావాల్సిన పరుగులు సాధించడమే నా లక్ష్యం" అని అన్నాడు. బౌలర్ ప్రణాళికలను అర్థం చేసుకుని, వారికి ఒత్తిడి కలిగించేలా ఆడతానని తెలిపాడు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. "మేం అతనితో ఎక్కువగా మాట్లాడం. అతడిని స్వేచ్ఛగా వదిలేస్తాం. నెట్స్‌లో అతనికి పూర్తి స్వేచ్ఛనిస్తాం. అతను తన పని తాను చేసుకుపోతాడు" అని చెప్పాడు. రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ (3/58) కూడా కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో పాలుపంచుకున్నాడు. వైభవ్ ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ.. "అతను 150 పరుగులు కూడా చేయగలడు. వైభవ్‌ను ఔట్ చేయాలంటే ఎలా బౌలింగ్ చేయాలో ఐపీఎల్ తర్వాత చెబుతాను" అని చమత్కరించాడు.
మరోవైపు ఓటమిపై సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించాడు. "245 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సరైన సమయంలో వికెట్లు కోల్పోవడం మా ఓటమికి కారణమైంది. వైభవ్ అద్భుతంగా ఆడాడు. యార్కర్లు మిస్ చేస్తే అతను వదిలిపెట్టడు" అని పేర్కొన్నాడు.