జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణ.. స్పీకర్‌కు చేరిన నివేదిక
- హైకోర్టు మాజీ జడ్జి యశ్వంత్ వర్మపై విచారణ పూర్తి
- తన నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించిన విచారణ కమిటీ
- ఈ నివేదికను అందించిన జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని కమిటీ
- త్వరలో పార్లమెంటు ఉభయ సభల ముందుకు నివేదిక
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన జడ్జెస్ ఎంక్వైరీ కమిటీ (న్యాయమూర్తుల విచారణ కమిటీ) తన నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని ఈ కమిటీ సభ్యులు పార్లమెంట్ హౌస్‌లో స్పీకర్‌ను కలిసి నివేదికను అందజేశారు.
ఈ కమిటీలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్య సభ్యులుగా ఉన్నారు. జడ్జెస్ (ఇంక్వైరీ) యాక్ట్, 1968 ప్రకారం చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా ఈ నివేదికను స్పీకర్‌కు సమర్పించారు.
జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణల విచారణ నిమిత్తం గత ఏడాది ఆగస్టు 12న లోక్‌సభ స్పీకర్ ఈ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సమర్పించిన ఈ నివేదికను తగిన సమయంలో పార్లమెంటు ఉభయ సభల ముందు ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. నివేదికలోని అంశాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.