పెద్ద సినిమాలకు కూడా వసూళ్లు తగ్గాయి.. భారీ కలెక్షన్లు నంబర్లు మాత్రమే: బన్నీ వాసు

Bunny Vasu Movie collections declined even for big films
  • పెద్ద సినిమాల ఆదాయం సగానికి పడిపోయిందన్న బన్నీ వాసు
  • టికెట్ రేట్ల పెరుగుదల వల్లే భారీ నంబర్లు కనిపిస్తున్నాయని వెల్లడి
  • ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో సినిమా కంటెంట్ ఉండటం లేదన్న వాసు

సినిమా ఇండస్ట్రీలో ఆదాయం క్రమంగా తగ్గుతోందని నిర్మాత బన్నీ వాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలకు కూడా గతంలో ఉన్నంత లాభాలు రావడం లేదని, ఆదాయం సగానికి పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న రూ. 500 కోట్లు, రూ. 1000 కోట్ల వసూళ్లు కేవలం టికెట్ రేట్ల పెరుగుదల, ఇతర ధరల పెరుగుదల వల్ల కనిపిస్తున్న భారీ నంబర్లు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఈ కలెక్షన్లు థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కావని ఆయన కుండబద్దలు కొట్టారు. అంటే సినిమాలకు జనం పెరగడం లేదు కానీ, ఉన్న జనం జేబుల నుంచే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారనేది ఆయన విశ్లేషణ సారాంశం.


సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో పడటానికి ఆయన నాలుగు ప్రధాన కారణాలను ప్రస్తావించారు. కేవలం 27 రోజుల్లోనే సినిమాలు ఓటీటీలోకి వచ్చేయడం, ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో కంటెంట్ లేకపోవడం, థియేటర్లకు వెళ్లడం భారం అనే భావన కలగడం, మల్టీప్లెక్సుల్లో విపరీతమైన క్యాంటీన్ ధరలు ప్రేక్షకులను దూరం చేస్తున్నాయని ఆయన వివరించారు. ఈ నాలుగు కారణాల్లో మూడు నేరుగా ఇండస్ట్రీ మేకర్స్ చేతిలోనే ఉన్నాయని, వాటిని సరిచేయకుండా కేవలం లాభాల వాటాల కోసం గొడవపడటం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని ఆయన హెచ్చరించారు. మూల సమస్యను పరిష్కరించకుండా ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయం మీద పోరాడటం వల్ల పరిశ్రమ మనుగడ కష్టమని బన్నీ వాస్ సూటిగా మాట్లాడారు.

Go Back to Shorts
Bunny Vasu
Telugu cinema
Tollywood
movie collections
OTT releases
theatrical revenue
movie industry crisis
ticket prices
multiplex prices

More Telugu News