మళ్లీ వచ్చేసిన ఐబొమ్మ.. టాలీవుడ్‌కు మళ్లీ టెన్షన్

iBomma Website Back Online Creates Tension for Tollywood
  • ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న ఐబొమ్మ రవి
  • మళ్లీ ఐబొమ్మలో యథేచ్ఛగా అప్‌లోడ్ అవుతున్న సినిమాలు, ఓటీటీ కంటెంట్
  • దీని రవి ఉన్నాడా లేక మరెవరైనా ఆపరేట్ చేస్తున్నారా అనేది సస్పెన్స్

టాలీవుడ్ కి మరోషాక్. తెలుగు సినీ పరిశ్రమను కొన్నేళ్లుగా పీడిస్తున్న పైరసీ భూతం 'ఐబొమ్మ' (iBomma) మళ్లీ ప్రత్యక్షమైంది. ఈ నెట్‌వర్క్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడంతో అంతా సద్దుమణిగిందని భావించిన టాలీవుడ్ పెద్దలకు ఈ పరిణామం పెద్ద షాక్ ఇస్తోంది.


కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు ఐబొమ్మ కీలక సూత్రధారి రవిని అరెస్ట్ చేసినప్పుడు, పైరసీకి అడ్డుకట్ట పడిందని సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. కానీ, ఆయన బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే సైట్ మళ్లీ యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాలు, ఓటీటీలోకి వచ్చిన కొత్త కంటెంట్‌ను ఐబొమ్మ తన డొమైన్లను మారుస్తూ యథేచ్ఛగా అప్‌లోడ్ చేస్తోంది.


ఐబొమ్మ నిర్వాహకుడు రవి పోలీసు నిఘాలో ఉన్న సమయంలోనే సైట్ మళ్లీ ప్రత్యక్షమవ్వడం విస్తుగొలుపుతోంది. దీని వెనుక ఏదైనా అంతర్జాతీయ నెట్‌వర్క్ ఉందా? లేదా ఇతర సర్వర్ల ద్వారా ఆపరేట్ చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైట్ మళ్లీ మొదలవడం వెనుక రవి ఉన్నాడా లేక మరెవరైనా ఆపరేట్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
iBomma
Tollywood
Telugu cinema
piracy
iBomma Ravi
Cyberabad police
OTT content
movie piracy
Telugu movies
film industry

More Telugu News