మన్నార్‌గుడి నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్

TTV Dinakaran Expels Mannargudi MLA for Supporting TVK Government
  • టీవీకే ప్రభుత్వానికి మద్దతు పలికినందుకు పార్టీ బహిష్కరణ
  • పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపణలు
  • పార్టీలోని అన్ని పదవులు, ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడి
విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు పలికినందుకు మన్నార్‌గుడి నుంచి విజయం సాధించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ఎమ్మెల్యేను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టి.టి.వి. దినకరన్ బహిష్కరించారు. ఈ మేరకు దినకరన్ వెల్లడించారు. అధికార పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలిపి పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు పార్టీలోని అన్ని పదవుల నుంచి, ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు.

మన్నార్‌గుడిలో ఆయన విజయం కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలను, నమ్మకంతో ఓటేసిన ప్రజలకు ఎమ్మెల్యే కామరాజ్ ద్రోహం చేశాడని విమర్శించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి కామరాజ్ మద్దతు ప్రకటించిన కొన్ని గంటలకే టీటీవీ దినకరన్ ఈ ప్రకటన చేశారు. అంతకుముందు, అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఎన్నికను స్వాగతిస్తూ టీవీకే ప్రభుత్వానికి ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు ప్రకటించారు.
Go Back to Shorts
TTV Dinakaran
AMMK
Mannargudi
MLA Kamaraj
Tamil Nadu Politics
TVK Government
Expelled

More Telugu News