తిరుమలలో హెవీ రష్... కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లు

  • ఆదివారం కావడంతో తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
  • శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం 
  • వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయిన వైనం
  • శనివారం శ్రీవారిని దర్శించుకున్న 81,512 మంది భక్తులు
  • హుండీ ద్వారా రూ. 3.23 కోట్ల ఆదాయం
తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. ఆదివారం కావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. భక్తుల క్యూలైన్లు కాంప్లెక్స్ వెలుపల కృష్ణతేజ అతిథి గృహం వరకు విస్తరించాయి.

ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ సమయం వర్తిస్తుందని పేర్కొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా, దర్శనానికి వచ్చే వారు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇక శనివారం (మే 9) ఒక్కరోజే 81,512 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 38,988 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.23 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది.

Tirumala
Tirumala rush
Tirupati
TTD
Sri Venkateswara Swamy
Krishna Teja Guest House
Devotees
Tonsure
Hundi collection
Tirumala updates

More Telugu News