పుదుచ్చేరిలో... ఐదోసారి సీఎం అవుతున్న రంగస్వామి

  • పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి ఘన విజయం
  • 5 స్థానాలకు పరిమితం అయిన డీఎంకే
  • 12 చోట్ల విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన రంగస్వామి పార్టీ
పుదుచ్చేరి సీఎం రంగస్వామి చరిత్రపుట్లోలకి ఎక్కబోతున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో, రంగస్వామి ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. మొత్తం 30 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 16 స్థానాలు అవసరం కాగా, ఎన్డీయే కూటమి 18 స్థానాలను (ఏఐఎన్ఆర్సీ-12, బీజేపీ-4, స్వతంత్రులు-2) కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీని దక్కించుకుంది. రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ 16 స్థానాల్లో పోటీ చేసి 12 చోట్ల విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే 5, కాంగ్రెస్ ఒక్క స్థానానికి పరిమితం అయ్యాయి.

పుదుచ్చేరి రాజకీయాల్లో అత్యంత సామాన్యుడిగా, మృదుభాషిగా పేరున్న రంగస్వామిని ఎమ్మెల్యేలందరూ తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో, త్వరలోనే ఆయన ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విజయం రంగస్వామి వ్యక్తిగత ఇమేజ్‌కు నిదర్శనం మాత్రమే కాకుండా, పుదుచ్చేరిలో ఎన్డీయే పట్టును మరింత బలోపేతం చేసింది.

Rangaswamy
Puducherry
Puducherry CM
AINRC
NDA alliance
Puducherry elections
Puducherry politics
BJP
DMK
Congress

More Telugu News