హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. ఆ ప్రాంతాల్లో డ్రోన్లు ఎగురవేయవద్దు!

  • ఎల్లుండి హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ
  • బేగంపేట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఆంక్షలు
  • రేపు అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు అమల్లో ఆంక్షలు
  • డ్రోన్లు, పారా గ్లైడర్లను ఎగురవేయడం నిషేధం
ఎల్లుండి (మే 10) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.

బేగంపేట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌ల పరిధిలో రేపు అర్ధరాత్రి 12 గంటల నుంచి 24 గంటల పాటు డ్రోన్‌లు, పారాగ్లైడర్‌‌లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ విమానాలు ఎగురవేయడాన్ని నిషేధించారు. ఈ మేరకు మల్కాజ్‌గిరి పోలీసులు 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పౌరులు ఆంక్షలను పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.

Narendra Modi
PM Modi Hyderabad Visit
Hyderabad
Telangana
Drone Ban
Security Restrictions

More Telugu News