బెంగాల్ సీఎం ఎంపిక.. రంగంలోకి అమిత్ షా!
- బెంగాల్ సీఎం ఎంపికపై బీజేపీ కీలక సమావేశం
- కోల్‌కతాలో ఎమ్మెల్యేలతో భేటీ కానున్న అమిత్ షా
- ఇప్పటికే రద్దయిన 17వ పశ్చిమ బెంగాల్ శాసనసభ
- సోషల్ మీడియాలో ఇంకా సీఎంగానే కొనసాగుతున్న మమత
- భవానీపూర్‌లో మమత ఓటమి
- గెలుపు మార్జిన్‌ను మించిన ఓటర్ల తొలగింపు
పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న బీజేపీ, ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం కోల్‌కతాలో పర్యటించనున్నారు. కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమై శాసనసభాపక్ష నేతను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికైన నేతే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అవుతారు.
పశ్చిమ బెంగాల్ 17వ శాసనసభ పదవీకాలం గురువారంతో ముగియడంతో, గవర్నర్ మే 7 నుంచి అసెంబ్లీని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అయితే, అసెంబ్లీ రద్దయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాల్లో తన హోదాను 'పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి' గానే కొనసాగిస్తుండటం గమనార్హం.
ఈ ఎన్నికల ఫలితాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మమత తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో 15,105 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కాగా, ఇదే నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారి సంఖ్య 45,240గా ఉంది. ఇది ఆమె ఓటమి మార్జిన్‌కు మూడు రెట్లు అధికం కావడం గమనార్హం.