01 Sun 11:39 పింక్ సాల్ట్ వాడుతున్నారా?.. అయితే ఈ విషయం తెలుసుకోండి! వైట్ సాల్ట్‌కు బదులుగా పింక్ సాల్ట్ వాడొద్దని నిపుణుల సూచన అయోడిన్ లోపాన్ని నివారించేందుకు వైట్ సాల్ట్ తప్పనిసరి పింక్ సాల్ట్‌లోని 84 ఖనిజాల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని వెల్లడి వంటల్లో వైట్ సాల్ట్, సలాడ్లపై పింక్ సాల్ట్ వాడటం మేలు
02 Thu 11:33 ఈ-కేబినెట్ విధానానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో అమలులో ఉన్న ఈ-కేబినెట్ విధానం ఈ విధానం కోసం రూ. 2 కోట్ల వ్యయంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్న వైనం ట్యాబ్‌లు, కంప్యూటర్ల ద్వారా ఎజెండాలు, ఫైల్స్ పరిశీలించే వెసులుబాటు
03 Thu 11:31 రౌడీ షీటర్ మిస్సింగ్ కేసులో చంద్రబాబు సీరియస్.. విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెన్షన్ సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి విజయవాడ కృష్ణలంక పీఎస్ కు తరలింపు అప్పటి నుంచి కనిపించకుండా పోయిన సాయికృష్ణ
04 Thu 11:28 తమిళ రాజకీయాల్లో కీలక మలుపు.. సీఎం విజయ్‌కు దగ్గరవుతున్న వైగో! డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి వైదొలగనున్న ఎండీఎంకే సీఎం విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకు సన్నాహాలు డీఎంకే గుర్తుపై గెలవడంతో ఎమ్మెల్యేల రాజీనామా అంశంపై పార్టీలో చర్చ జూన్ 27న పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడిన వైగో కుమారుడు దురై వైగో
05 Thu 11:23 నేటి నుంచి ‘పెద్ది’లో మరో ఆరు నిమిషాల కొత్త సన్నివేశాలు జూన్ 4న విడుదలైన పెద్ది 5 నిమిషాల 56 సెకన్ల నిడివిని కొత్తగా చేర్చిన సినీ బృందం మధ్యలో జాన్వీ కపూర్ సీన్లు తొలగించిన నేపథ్యంలో ప్రాధాన్యం కొత్త సన్నివేశాల్లో ఏముంటుందోనని ఆసక్తి నేటి నుంచి సాధారణ ధరలతో టికెట్లు
06 Thu 11:09 ఉస్మానియా యూనివర్సిటీకి అరుదైన గౌరవం.. దేశంలోనే తొలి వర్సిటీగా ఓయూ రికార్డు దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 4 ఐఎస్ఓ సర్టిఫికెట్లు పొందిన ఓయూ విద్యా, పర్యావరణ, ఇంధన, ఆహార భద్రత నిర్వహణలో అంతర్జాతీయ గుర్తింపు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి ధ్రువపత్రాలు స్వీకరించిన వర్సిటీ ప్రమాణాలు నిలబెట్టుకోవడమే అసలైన సవాల్ అని సూచించిన బీఐఎస్ వర్సిటీ 109 ఏళ్ల చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టమన్న వీసీ ప్రొఫెసర్ కుమార్
07 Thu 11:03 జీ7లో సభ్యత్వం లేదు.. అయినా భారత్‌కు రెడ్ కార్పెట్ ఎందుకు? గ్లోబల్ సౌత్ గొంతుకగా భారత్‌కు గుర్తింపు ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో ఒకటి చైనాకు చెక్ పెట్టగలిగే వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌కు గుర్తింపు వాతావరణ లక్ష్యాల్లో కీలక పాత్ర స్వతంత్ర విదేశాంగ విధానంతో ప్రత్యేకత
08 Thu 10:59 నియోజకవర్గాల పునర్విభజనపై చంద్రబాబుకు శశి థరూర్ కౌంటర్.. డ్రైవర్ జీతం ఉదాహరణతో సంచలన పోస్ట్! లోక్‌సభ స్థానాల పునర్విభజన అంశంపై చంద్రబాబు, శశి థరూర్ మధ్య మేధోపరమైన చర్చ అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచినా.. ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాదికే లాభమని థరూర్ వాదన శాతాల వారీగా పెంపు సమానంగా ఉన్నా.. సంఖ్యాపరంగా పెద్ద రాష్ట్రాలకే రాజకీయ పట్టు పెరుగుతుందని హెచ్చరిక గతంలో వాజపేయి హయాంలో దక్షిణాది ప్రయోజనాలను కాపాడానని గుర్తుచేసిన చంద్రబాబు
09 Thu 10:47 రొనాల్డో ప్లాప్ షో.. ‘మెస్సీ, మెస్సీ’ నినాదాలతో హోరెత్తిన స్టేడియం.. ఇదిగో వీడియో! ఫీఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌కు డీఆర్ కాంగో ఊహించని షాక్ ఇరు జట్లు 1-1తో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన వైనం గోల్ చేయడంలో విఫలమైన రొనాల్డోకు 'మెస్సీ' నినాదాలతో నిరసన ప్రపంచకప్‌లో తమ మొట్టమొదటి గోల్‌ను నమోదు చేసిన కాంగో రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్‌లో ఆడుతున్న క్రిస్టియానో రొనాల్డో
10 Thu 10:37 ఢిల్లీలో భారీ సైబర్ మోసం.. మాజీ ప్రధాని కుమారుడి అకౌంట్ నుంచి కోట్లు స్వాహా! ఐకే గుజ్రాల్ కుమారుడు, మాజీ ఎంపీ నరేష్ గుజ్రాల్ కంపెనీలో భారీ సైబర్ దోపిడీ నరేష్ గుజ్రాల్ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోతో నకిలీ ఖాతా సృష్టించిన సైబర్ నేరగాళ్లు యజమానే స్వయంగా ఆర్డర్ ఇచ్చారని భ్రమపడి కోట్ల రూపాయలు బదిలీ చేసిన ఉద్యోగి కుమార్తె దీక్షా గుజ్రాల్ చొరవతో వెలుగులోకి వచ్చిన మోసం తక్షణ స్పందన వల్ల మోసపోయిన మొత్తంలో 70 శాతం రికవరీ