ఆడుతూపాడుతూ గెలిచిన చెన్నై... ముంబై ఈసారి కూడా కుదేల్!
- ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో గెలుపు
- కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కార్తీక్ శర్మ అజేయ అర్ధశతకాలు
- 98 పరుగుల కీలక భాగస్వామ్యంతో చెన్నైకి సునాయాస విజయం
- మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 7 వికెట్లకు 159 పరుగులు
- చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్ కు మూడు వికెట్లు
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), కార్తీక్ శర్మ (54 నాటౌట్) అజేయ అర్ధశతకాలతో చెలరేగి జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సంజూ శాంసన్ (11), ఉర్విల్ పటేల్ (24) త్వరగానే వెనుదిరిగారు. దీంతో 62 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ గైక్వాడ్, కార్తీక్ శర్మ ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 98 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి మరో 11 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. గైక్వాడ్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో, కార్తీక్ శర్మ 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో రాణించారు.
అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. నమన్ ధిర్ (57) ఒక్కడే అర్ధశతకంతో రాణించగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 18) నెమ్మదిగా ఆడి నిరాశపరిచాడు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 3 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా, నూర్ అహ్మద్ 2 వికెట్లతో అతనికి సహకరించాడు. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో మరింత ముందుకు దూసుకెళ్లింది.