అత‌ను 10 సార్లు లైంగికంగా వేధించాడు: కుంభమేళా ఫేమ్ మోనాలిసా సంచలన ఆరోపణలు

  • బాలీవుడ్ దర్శకుడు సనోజ్ త‌న‌ను లైంగికంగా వేధించాడ‌న్న మోనాలిసా
  • ఆయ‌న‌తో పాటు నలుగురిపై పోక్సో కేసు
  • సినిమా షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదు
  • కుటుంబంతో వివాదం తర్వాత మరో వివాదంలో మోనాలిసా
  • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎర్నాకులం పోలీసులు
కుంభమేళాలో పూసలమ్ముతూ కనిపించి, తన అందంతో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిన మోనాలిసా జీవితం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రేమ వివాహంతో కుటుంబానికి దూరమైన ఆమె, ఇప్పుడు తనను లైంగికంగా వేధించారంటూ బాలీవుడ్ దర్శకుడితో పాటు నలుగురిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కేరళలోని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

మోనాలిసా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా, విశ్వ హిందూ పరిషత్ (VHP) నాయకుడు, న్యాయవాది అయిన అనిల్ విలయిల్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే సినిమా షూటింగ్ సందర్భంగా ఈ ఘటనలు జరిగాయని మోనాలిసా తన ఫిర్యాదులో పేర్కొంది. ఏప్రిల్ 29న ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు పీటీఐ కథనం ద్వారా తెలిసింది.

అసభ్యంగా తాకాడు.. కుటుంబం పట్టించుకోలేదు
కొచ్చిలో జరిగిన ఒక సమావేశంలో దర్శకుడు సనోజ్ మిశ్రా తనను చాలాసార్లు అసభ్యకరంగా తాకాడ‌ని మోనాలిసా ఆరోపించింది. "దర్శకుడు నన్ను షూటింగ్ సెట్‌లో దాదాపు 10 సార్లు లైంగికంగా వేధించాడు. అసభ్యంగా తాకాడు. ఈ విషయం గురించి మా కుటుంబ సభ్యులకు చెబితే, వారు కనీసం పట్టించుకోలేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 30న మోనాలిసా కోర్టు ముందు హాజరై తన అధికారిక వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ ఘటనలు మధ్యప్రదేశ్‌లో జరిగినందున, కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇటీవల మోనాలిసా తన కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఫర్మాన్ ఖాన్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆమె మైనర్ అని, ఫర్మాన్ 'లవ్ జిహాద్'కు పాల్పడ్డాడని ఆమె కుటుంబం ఆరోపించింది. అయితే, మోనాలిసా మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఈ లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆమె వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారింది. ఒకవైపు కుటుంబ వివాదాలు, మరోవైపు ఈ కేసులతో మోనాలిసా భవిష్యత్తు ఎలా ఉండబోతుందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది.

Monalisa
Monalisa Kumbh Mela
Sanoj Mishra
The Diary of Manipur
Anil Vilayil
sexual harassment case
Ernakulam police
love jihad
Farman Khan
Bollywood director

More Telugu News