ఆధ్యాత్మిక రహస్యాల చుట్టూ తిరిగే 'అగధ'

  • ఎమ్మెస్ రాజు నుంచి 'అగధ'
  • ప్రధానమైన పాత్రలో జోవిక 
  • 85 రోజుల పాటు షూటింగు జరుపుకున్న సినిమా 
  • 45 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్
     

ఆధ్యాత్మిక రహస్యాలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తూనే ఉంటాయి .. ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తూనే ఉంటాయి. దైవిక శక్తులు .. అవి చూపించే ప్రభావం చుట్టూ ఈ తరహా కథలు నడుస్తూ ఉంటాయి. ఇలాంటి కథలు గతంలో ఎమ్మెస్ రాజు బ్యానర్లో రూపొందాయి. కథాకథనాల పరంగా అలరిస్తూ, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేశాయి. అలాంటి ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమానే 'అగధ'.

టైటిల్ తో .. ఆ టైటిల్ ను డిజైన్ చేసిన తీరుతో అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా ఇది. సీనియర్ నటి మంజుల మనవరాలు .. వనిత విజయ్ కుమార్ కూతురు 'జోవిక' ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించింది. రీసెంటుగా వదిలిన ఆమె పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉల్కా గుప్తా .. కామాక్షి భాస్కర్ల పోస్టర్లు కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచాయని చెప్పాలి. ఆదివరహా బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 

ఆధ్యాత్మిక రహస్యాలు .. దైవిక శక్తుల చుట్టూ తిరిగే కథ ఇది. అందువలన గ్రాఫిక్స్ కి ఎక్కువ అవకాశం ఉన్న కంటెంట్ ఇది. సినిమా నిడివిలో 45 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటాయని చెబుతుండటం ఆడియన్స్ లో మరింత ఉత్కంఠను పెంచుతోంది. 85 రోజుల పాటు షూటింగు జరుపుకున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా, సంచలనాన్ని సృష్టించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

MS Raju
Agadha
Jovika
Ulka Gupta
Kaamakshi Bhaskarla
Telugu movie
spiritual secrets
divine powers
graphics
Indian cinema

More Telugu News