వేడుకగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ రిసెప్షన్

  • హైదరాబాద్‌లో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహ రిసెప్షన్
  • వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సినీ ప్రముఖులు
  • చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున, నాగ చైతన్య వంటి తారల హాజరు
  • ఏప్రిల్ 29న తిరుమలలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వివాహం
టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహ రిసెప్షన్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కింగ్ నాగార్జున, యువసామ్రాట్ నాగ చైతన్య, హీరో శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, జయసుధ, సుమ కనకాల వంటి తారలు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నూతన వధూవరులతో ఫోటోలు దిగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా, సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహం ఏప్రిల్ 29న తిరుమల శ్రీవారి సన్నిధిలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య సంప్రదాయబద్ధంగా జరిగిన విషయం తెలిసిందే.

మరోవైపు తన వివాహ వేడుక ఫోటోలను సాయి శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అర్ధాంగిని పరిచయం చేస్తూ, ఆమె పవర్ ఫుల్ అని పేర్కొన్నారు.

Bellamkonda Sreenivas
Bellamkonda Sreenivas reception
Kavya Reddy
Telugu cinema wedding
Chiranjeevi
Mohan Babu
Nagarjuna
Tollywood celebrities

More Telugu News