దీనంగా పాకిస్థాన్ పరిస్థితి.. ఒక్క రోజుకు కూడా పెట్రోల్ నిల్వలు లేవన్న పాక్ మంత్రి

  • పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం
  • అంతర్జాతీయంగా చిన్న అంతరాయం కలిగినా దేశం చీకట్లోకి వెళ్లిపోతుందన్న పాక్ మంత్రి
  • భారత్ 70 రోజులకు సరిపడా ఇంధన నిల్వలను ఉంచుకుంటుందని వ్యాఖ్య

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాల ఇంధన భద్రతను ప్రశ్నిస్తున్న తరుణంలో, పాకిస్థాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి. ఒక దేశానికి నెలల తరబడి సరిపోయే ఇంధన నిల్వలు ఉండటం కనీస అవసరం కాగా, పాకిస్థాన్‌లో కేవలం 5 నుంచి 7 రోజులకు సరిపడా ముడి చమురు మాత్రమే ఉండటం ఆశ్చర్యకరం.


ఈ సందర్భంగా భారతదేశపు వ్యూహాత్మక చమురు నిల్వల సామర్థ్యాన్ని పాక్ మంత్రి కొనియాడటం గమనార్హం. "భారత్ తన భూగర్భ గదుల్లో 60 నుంచి 70 రోజులకు సరిపడా భారీ నిల్వలను అత్యవసర పరిస్థితుల కోసం సిద్ధంగా ఉంచుకుంది. కానీ పాకిస్థాన్ మాత్రం కేవలం వాణిజ్య నిల్వలను నమ్ముకుని, ప్రతిరోజూ వచ్చే సరఫరాపైనే ఆధారపడే 'Just-in-Time' విధానాన్ని అనుసరిస్తోంది. ఒకవేళ అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో చిన్న అంతరాయం కలిగినా, వారం రోజుల్లోనే మన దేశం పూర్తి చీకట్లోకి వెళ్లే ప్రమాదం ఉంది" అని మంత్రి అన్నారు.


Pakistan
Fuel

More Telugu News