శాంతిపునరుద్ధరణ కోసం ప్రతిదీ చేస్తాం: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

  • త్వరగా శాంతినెలకొనేలా చేసేందుకు కృషి చేస్తామన్న పుతిన్
  • ప్రజలకు ఉపయోగపడే ప్రతిదీ చేస్తామని అరాఘ్చీకి హామీ
  • రష్యా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపిన ఇరాన్ విదేశాంగ మంత్రి
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. పశ్చిమాసియాలో తమకు సాధ్యమైనంత వరకు శాంతిపునరుద్ధరణ కోసం ప్రతిదీ చేస్తామని అన్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పశ్చిమాసియా ప్రాంతంలో త్వరగా శాంతి నెలకొనేలా చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.

ఈ ప్రాంత ప్రజలందరి ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రతిదీ చేస్తామని అరాఘ్చీతో పుతిన్ చెప్పినట్లు రష్యా ప్రభుత్వ మీడియా పేర్కొంది. అరాఘ్చీ రష్యా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. రష్యా, ఇరాన్ మధ్య సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని అన్నారు. ఇవి మరింతగా బలోపేతమవుతున్నట్లు పేర్కొన్నారు.

చర్చలు విఫలం కావడానికి అమెరికానే కారణం

పుతిన్‌తో వేదిక పంచుకోవడానికి ముందు అరాఘ్చీ మాట్లాడారు. ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ, యుద్ధం ముగింపునకు చర్చలు విఫలమవ్వడానికి అమెరికాయే కారణమని ఆరోపించారు. కాగా, ఇస్లామాబాద్ వేదికగా అమెరికాతో నేరుగా చర్చలు జరపడానికి ఇష్టపడని ఇరాన్, ప్రతినిధుల బృందం, తమ డిమాండ్లను పాకిస్థాన్ అధికారులకు అందజేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగింది.

Putin tells Iran FM Araghchi Russia will do everything to secure peace in Mideast
Russia President Putin

More Telugu News