కేఎల్ రాహుల్ విశ్వరూపం... ఢిల్లీ క్యాపిటల్స్ కళ్లు చెదిరే స్కోరు
- పంజాబ్ కింగ్స్‌పై చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు
- కేవలం 67 బంతుల్లో 152 పరుగులతో అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్
- ఐపీఎల్లో రాహుల్‌కు ఇది ఆరో సెంచరీ
- రాహుల్, నితీశ్ రాణా కలిసి రెండో వికెట్‌కు 220 పరుగుల భాగస్వామ్యం
- 20 ఓవర్లలో 2 వికెట్లకు 264 పరుగుల భారీ స్కోరు చేసిన ఢిల్లీ
ఐపీఎల్ లో భాగంగా, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగి అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. రాహుల్ (152 నాటౌట్; 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లు) అసాధారణ ఇన్నింగ్స్‌కు, నితీశ్ రాణా (91; 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు తోడవడంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ రాహుల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఈ సీజన్‌కే హైలైట్‌గా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో కేఎల్ రాహుల్‌కు ఇది ఆరో సెంచరీ కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే ఓపెనర్ పతుమ్ నిస్సంక (11) వికెట్‌ను 28 పరుగుల వద్ద కోల్పోయి ఢిల్లీ కాస్త తడబడింది. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణాతో కలిసి కేఎల్ రాహుల్ అసలు సిసలైన విధ్వంసం ప్రారంభించాడు. వీరిద్దరూ పంజాబ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. ముఖ్యంగా రాహుల్ తన క్లాస్ ఆటతో పాటు మాస్ హిట్టింగ్‌ను ప్రదర్శించాడు. బౌలర్ ఎవరైనా, బంతి ఎలాంటిదైనా బౌండరీకి తరలించడమే లక్ష్యంగా ఆడాడు. ఫీల్డర్లు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యేలా బౌండరీల వర్షం కురిపించాడు. ఒకవైపు రాహుల్ క్లాసిక్ షాట్లతో అలరిస్తే, మరోవైపు నితీశ్ రాణా తనదైన శైలిలో భారీ షాట్లతో పంజాబ్‌పై ఎదురుదాడికి దిగాడు.
ఈ జోడీ రెండో వికెట్‌కు ఏకంగా 95 బంతుల్లో 220 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది. సెంచరీకి కేవలం 9 పరుగుల దూరంలో నితీశ్ రాణా ఔటైనప్పటికీ, రాహుల్ మాత్రం చివరి వరకు క్రీజులో నిలిచి తన జట్టుకు కొండంత స్కోరును అందించాడు. రాహుల్ ప్రతాపంతో పంజాబ్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. జేవియర్ బార్ట్లెట్ 4 ఓవర్లలో 69 పరుగులు సమర్పించుకోగా, విజయ్‌కుమార్ వైశాఖ్ 3 ఓవర్లలోనే 48 పరుగులు ఇచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్, మార్కో యాన్సెన్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మొత్తంగా రాహుల్ సృష్టించిన ఈ తుపానుతో పంజాబ్ ముందు 265 పరుగుల కఠినమైన లక్ష్యం నిలిచింది. ఈ స్కోరును ఛేదించడం పంజాబ్‌కు పెను సవాల్‌తో కూడుకున్నదే.