డీఎన్ఏ టెస్టు ప్రకారం భరణం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- డీఎన్ఏ టెస్టులో తండ్రి కాదని తేలితే భరణం చెల్లించాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు
- వివాహ బంధంలో ఉండగా బిడ్డ పుట్టినా ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసిన ధర్మాసనం
- చట్టపరమైన అంచనాల కంటే శాస్త్రీయ ఆధారాలకే ఎక్కువ విలువనిచ్చిన న్యాయస్థానం
- బిడ్డ బాగోగులు చూసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాల జారీ
పిల్లల భరణానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. డీఎన్ఏ పరీక్షలో ఒక వ్యక్తి తండ్రి కాదని నిరూపితమైతే, ఆ బిడ్డకు భరణం చెల్లించమని అతడిని బలవంతం చేయలేమని స్పష్టం చేసింది. వివాహ బంధం కొనసాగుతున్న సమయంలో బిడ్డ పుట్టినప్పటికీ ఈ నిబంధన వర్తిస్తుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్‌కే సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఓ మహిళ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది.
ఓ వ్యక్తి ఇంట్లో మూడేళ్లుగా పనిచేస్తున్న మహిళ.. పెళ్లి పేరుతో ఆ వ్యక్తి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. ఆ తర్వాత 2016 మార్చిలో వారిద్దరూ వివాహం చేసుకోగా, ఏప్రిల్‌లో వారికి ఒక పాప పుట్టింది. కొద్దికాలానికే వారి మధ్య విభేదాలు రావడంతో, 2016 జులైలో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. తనకు, తన కుమార్తెకు నెలకు రూ.25,000 భరణం ఇప్పించాలని పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసు విచారణలో భాగంగా ట్రయల్ కోర్టు డీఎన్ఏ పరీక్షకు అనుమతించింది. ఆ పరీక్షలో సదరు వ్యక్తి ఆ బిడ్డకు తండ్రి కాదని తేలింది. ఈ నివేదిక ఆధారంగా కోర్టు భరణం పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని అప్పీలేట్ కోర్టు, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు కూడా సమర్థించాయి. హైకోర్టు తీర్పు ప్రకారం, భారత సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 112 ప్రకారం వివాహ బంధంలో పుట్టిన బిడ్డకు చట్టబద్ధత లభించినప్పటికీ, డీఎన్ఏ పరీక్ష ఫలితాలు దాన్ని తోసిపుచ్చగలవని పేర్కొంది.
ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, ధర్మాసనం హైకోర్టు వాదనతో ఏకీభవించింది. చట్టపరమైన ఊహ కంటే తిరుగులేని శాస్త్రీయ ఆధారం (డీఎన్ఏ పరీక్ష) బలంగా నిలుస్తుందని స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పుతో సంబంధం లేకుండా బిడ్డ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయరాదని పేర్కొంది. ఆ చిన్నారి బాగోగులు, విద్య, ఆరోగ్యం, పోషణ వంటి అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖను ఆదేశించింది.