దావోస్, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లోని ఎంవోయూలపై రేవంత్ రెడ్డి సమీక్ష
- కంపెనీలకు సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచన
- ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సూచన
- ప్రముఖ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని డేటా సెంటర్లు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించి, ప్రముఖ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. ఆయా సంస్థలు రాష్ట్రంలో త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని అన్నారు.