గ్లోబల్ టాప్ 10 చికెన్ వంటకాల జాబితాలో కొరియన్ చికెన్ ఫస్ట్.. మన 'బటర్ చికెన్' ర్యాంక్ ఎంతంటే..?
- ప్రపంచంలోని బెస్ట్ 100 చికెన్ వంటకాల జాబితాను విడుదల చేసిన టేస్ట్ అట్లాస్
- మొదటి స్థానంలో నిలిచిన దక్షిణ కొరియా వంటకం 'చికెన్' (కొరియన్ ఫ్రైడ్ చికెన్)
- ఆరో స్థానం దక్కించుకున్న భారతీయ వంటకం 'బటర్ చికెన్'
- రెండు సార్లు ఫ్రై చేయడం వల్లే కొరియన్ చికెన్‌కు అద్భుతమైన రుచి
మొదటి స్థానంలో నిలిచిన కొరియన్ ఫ్రైడ్ చికెన్ ప్రత్యేకత ఏంటంటే.. దీనిని రెండు సార్లు ఫ్రై చేస్తారు (డబుల్ ఫ్రైయింగ్ మెథడ్). ముందుగా తక్కువ ఉష్ణోగ్రత వద్ద చికెన్‌ను నూనెలో వేయించి, ముక్క లోపల బాగా ఉడికేలా చేస్తారు. ఆ తర్వాత ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మళ్లీ వేయించడం ద్వారా చికెన్ పైన ఎంతో క్రిస్పీగా, క్రంచీగా మారుతుంది. దీనికి స్పైసీ గోచుజాంగ్, సోయా గార్లిక్, హనీ బటర్ వంటి సాస్‌లను జోడించి అందిస్తారు. కొన్నిచోట్ల ఈ ఫ్రైడ్ చికెన్‌ను సాస్‌లో కలిపి లేదా పైన సాస్ వేసి ఇస్తారు. ఈ వంటకంతో పాటు పికిల్డ్ ముల్లంగి, కోల్‌స్లా లేదా పుచ్చకాయ ముక్కలను సైడ్ డిష్‌గా తీసుకుంటారు. ముఖ్యంగా దీన్ని బీర్‌తో కలిపి తీసుకోవడానికి అక్కడి ప్రజలు ఇష్టపడతారు. ఆ కాంబినేషన్‌ను 'చిమెక్' అని పిలుస్తారు.
టేస్ట్ అట్లాస్ ప్రకటించిన టాప్ 10 చికెన్ వంటకాలు ఇవే:
1. చికిన్ (కొరియన్ ఫ్రైడ్ చికెన్) - సౌత్ కొరియా
2. పోలో ఎ లా బ్రసా (పెరూవియన్ రోస్ట్ చికెన్) - పెరూ
3. ఇనాసల్ నా మనోక్ - ఫిలిప్పీన్స్
4. పిలిక్ తోప్కపి - టర్కీ
5. ముర్గ్ కరాహీ (చికెన్ కరాహీ) - పాకిస్థాన్
6. ముర్గ్ మఖానీ (బటర్ చికెన్) - ఢిల్లీ, ఇండియా
7. రఫిస్సా - మొరాకో
8. కరాగే - జపాన్
9. పౌలెట్ రోటీ (ఫ్రెంచ్ రోస్ట్ చికెన్) - ఫ్రాన్స్
10. సిట్సిలా టబాకా (చికెన్ టబాకా) - జార్జియా