హర్మూజ్ జలసంధి వద్ద భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ ఏమన్నదంటే?
- రెండు రోజుల క్రితం భారత జెండా కలిగిన నౌకలపై కాల్పులు
- కాల్పులు జరిపింది మా బలగాలేనా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి
- సంబంధిత సంస్థలు విచారణ చేపట్టాయన్న ఇరాన్
శనివారం హర్మూజ్ జలసంధిలో ఐఆర్‌జీసీ అనుమతి లభించిన అనంతరం ప్రయాణిస్తున్న రెండు భారత నౌకలపై కాల్పులు జరిగాయి. దీనితో ఆ రెండు నౌకలు తిరిగి పర్షియన్ గల్ఫ్‌లోకి వెళ్లిపోయాయి. ఒక నౌకలో 20 లక్షల బ్యారెళ్ల చమురు ఉంది. ఈ ఘటనపై భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీకి కేంద్రం సమన్లు జారీ చేసింది. ఇరాన్ జలసంధిని తెరిచినట్లు ప్రకటించిన తర్వాత ఈ నౌకలు బయల్దేరగా, వాటిపై కాల్పులు జరగడంతో భారత్ తీవ్రంగా స్పందించింది.