ఓట్ల తొలగింపుతో ఎన్నికలు ప్రభావమైతే తప్ప ఎన్నికను రద్దు చేయలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Election cannot be cancelled for voter deletion unless election is affected
అధిక సంఖ్యలో ఓట్లను తొలగించినా, ఆ తొలగింపు వల్ల ఎన్నికలు ప్రభావమైతే తప్ప ఎన్నికను రద్దు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయపరమైన జోక్యం అనేది ఎన్నికలను ప్రోత్సహించేలా ఉండాలని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన 'సర్' ప్రక్రియపై భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితాలో కొనసాగే హక్కు ఓటరుకు ఉంటుందని, ఎన్నికలు నిర్వహించాలనే ఒత్తిడితో ప్రక్రియను వక్రీకరించకూడదని పేర్కొంది.

అయితే, 'సర్' ప్రక్రియలో ఓట్లు తొలగించారంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్లు ఇప్పటికే అప్పిలేట్ ట్రైబ్యునళ్ల ముందు విచారణకు ఉన్నాయని గుర్తు చేసింది.

సరైన ప్రక్రియ లేకుండా ఎన్నికల సంఘం ఏకపక్షంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తోందని, ఈ తొలగింపులపై దాఖలైన పిటిషన్లను సకాలంలో విచారించడం లేదని పిటిషనర్లు ఆరోపించగా, పిటిషనర్లు ఇప్పటికై ట్రైబ్యునళ్లను ఆశ్రయించారని, కాబట్టి ఈ వాదనల్లో పసలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

'సర్' ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు 19 ట్రైబ్యునళ్లు ఏర్పడినట్లు ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారించాల్సిన అప్పీళ్ల సంఖ్య 30 నుంచి 34 లక్షల వరకు ఉంటాయని తెలిపింది.

అయితే ఈ అప్పీళ్లను నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరిస్తారా లేక గడువును పొడిగిస్తూనే ఉంటారా అని పిటిషనర్ల తరపు న్యాయవాది ప్రశ్నించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు, ఈ దేశంలో ఓటు రాజ్యాంగపరమైనదే కాకుండా, భావోద్వేగ అంశం కూడా అని పేర్కొంది. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో భాగమని తెలిపింది. ఒక ప్రభుత్వాన్ని ఎంచుకోవడంలో ఇది కీలకమని వ్యాఖ్యానించింది. అలాగే విచారణకు సంబంధించి కాలపరిమితిని నిర్ణయించి ట్రైబ్యునళ్లపై భారం మోపలేమని స్పష్టం చేసింది. అధిక సంఖ్యలో ఓటర్లను తొలగించినా, ఆ తొలగింపు వల్ల ఎన్నికలు ప్రభావమైతే తప్ప ఎన్నికను రద్దు చేయలేమని తెలిపింది.
Go Back to Shorts
Supreme Court of India
Election Commission of India
voter list
voter deletion
election process
West Bengal elections

More Telugu News