ఓటు కోసం బయోమెట్రిక్ విధానం... కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- ఐరిస్ బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్ విధానాలను ప్రవేశపెట్టాలని పిటిషన్
- ఈ అభ్యర్థనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకారం
- ప్రస్తుత ఎన్నికలకు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టీకరణ
- రానున్న కాలంలో జరిగే ఎన్నికల కోసం పరిశీలించాల్సి ఉందన్న సుప్రీంకోర్టు
ఇప్పటికే కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికలు పూర్తయ్యాయి. తమిళనాడులో ఏప్రిల్ 23న... పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న రెండు విడతల్లో ఓటింగ్ జరగనుంది. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికలకు ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది.
రానున్న కాలంలో జరగబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు బయోమెట్రిక్ విధానం అమలు చేయడాన్ని పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అంశంపై స్పందించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.