భారత క్రికెట్‌ను గ్యారీ కిర్‌స్టెన్ మార్చేశాడు.. అతని కోచింగ్ వల్లే టీమిండియా దశ తిరిగింది: యువీ
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. 2008 నుంచి 2011 మధ్య కాలంలో భారత జట్టు సాధించిన విజయాల్లో కిర్‌స్టెన్ కీలక పాత్ర పోషించాడని, అతని కోచింగ్ విధానం జట్టు రూపురేఖలనే మార్చేసిందని యువీ గుర్తుచేసుకున్నాడు. ముఖ్యంగా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపి, వారిని నడిపించిన తీరు అద్భుతమని కొనియాడాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌తో 'స్టిక్ టు క్రికెట్' అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ యువరాజ్ ఈ విషయాలను పంచుకున్నాడు. కిర్‌స్టెన్ కోచింగ్‌లో భారత జట్టు ఎదిగిన తీరును వివరిస్తూ... "ఆ సమయంలో గ్యారీ కిర్‌స్టెన్ ప్రభావం చాలా ఉంది. మాకు అప్పుడు కావాల్సింది ఒక మంచి వ్యక్తి. మైదానంలో జట్టుగా మెలగాలని చెప్పే వ్యక్తి అవసరం. గ్యారీ ఆ పాత్రను సంపూర్ణంగా పోషించాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు" అని తెలిపాడు.
కిర్‌స్టెన్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే తమతో చెప్పిన మాటలను యువరాజ్ గుర్తుచేసుకున్నాడు. "కోచ్‌గా వచ్చిన తొలిరోజే, రాబోయే నాలుగేళ్లలో టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ మనం నంబర్ వన్ స్థానానికి చేరుకుంటామని గ్యారీ చెప్పాడు. ఆయన మాటలు విని కొందరు ఆటగాళ్లు ఒకరినొకరు చూసుకున్నారు. 'ఏంటి ఈయన చెప్పేది?' అని ఆశ్చర్యపోయారు. కానీ, ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతున్న రోజుల్లోనే, అతను చెప్పినట్లు నాలుగేళ్లలో మేము ఆ ఘనత సాధించాం. అతని ఉద్దేశం చాలా గొప్పది. భారత క్రికెట్‌ను కిర్‌స్టెన్ మరో స్థాయికి తీసుకెళ్లాడు" అని యువరాజ్ వివరించాడు.
కోచ్ ఇచ్చే భరోసా ఆటగాళ్లపై ఎంత ప్రభావం చూపుతుందో యువీ తన సొంత అనుభవంతో చెప్పాడు. "గ్యారీ ఎప్పుడూ నాతో, 'నువ్వొక గేమ్ ఛేంజర్. నా మ్యాచ్ విన్నర్ నువ్వే. నువ్వు ఎన్నిసార్లు విఫలమయ్యావన్నది నాకు అనవసరం. వెళ్లి మన కోసం మ్యాచ్ గెలిపించు' అని చెప్పేవాడు. ఈ మాటలు నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. జట్టు, కోచ్ నాపై నమ్మకం ఉంచారని అర్థమైంది. 'నువ్వు 20-25 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే ఆట స్వరూపమే మారిపోతుంది. వెళ్లి నీ సహజమైన ఆట ఆడు' అని ప్రోత్సహించేవాడు. అతను ఇచ్చిన ఆత్మవిశ్వాసంతోనే నేను స్వేచ్ఛగా ఆడగలిగాను" అని యువీ పేర్కొన్నాడు. కిర్‌స్టెన్ మార్గనిర్దేశనంలోనే భారత జట్టు 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచి, అన్ని ఫార్మాట్లలోనూ అగ్రస్థానానికి చేరిన విషయం తెలిసిందే.