కాల్పుల విరమణ.. పాకిస్థాన్ ప్రధాని పోస్టు వెనుక ట్రంప్ ఉన్నారా?

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇస్లామాబాద్ వేదికగా ఎల్లుండి ఇరాన్, అమెరికా దేశాల ప్రతినిధులు చర్చలు ప్రారంభించనున్నారు. యుద్ధానికి ముగింపు పలకడానికి చర్చలు అవసరమని, ఇందుకు రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాలని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కోరుతూ పోస్టు పెట్టారు.

అయితే ఈ పోస్టు పలు అనుమానాలకు తావిస్తోంది. పాకిస్థాన్ ప్రధాని చేసిన పోస్టు నామమాత్రమేనని, అంతా ట్రంప్‌కు తెలిసే జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇరాన్‌కు రెండు వారాల గడువు ఇవ్వాలని పాక్ ప్రధాని కోరగా, అందుకు ట్రంప్ అంగీకరించి కాల్పుల విరమణకు ఓకే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కానీ పాకిస్థాన్ ప్రధాని ఈ పోస్టు చేయకముందే అమెరికాకు ఈ విషయం తెలుసని, ట్రంప్ కనుసన్నుల్లోనే ఇది జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

షెహబాజ్ షరీఫ్ పోస్టు చేయడానికి ముందు, ఆ సందేశాన్ని తెరవెనుక వైట్ హౌస్ రివ్యూ చేసిందని అంటున్నారు. కాల్పుల విరమణ కోసం పాకిస్థాన్ ప్రధాని షేర్ చేసిన పోస్టులో పైన "డ్రాఫ్ట్-ఎక్స్‌లో పాకిస్థాన్ ప్రధాని సందేశం" అని తొలుత కనిపించింది. కానీ ఆ తర్వాత ఆ సందేశాన్ని ఎడిట్ చేసి పైనున్న లైన్‌ను తొలగించారు. దీంతో అది కాపీ పేస్ట్ పొరపాటని, ట్రంపే ఆ సందేశాన్ని రూపొందించారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే వైట్ హౌస్ దానిని తోసిపుచ్చింది.

Shehbaz Sharif
Pakistan
Iran
America
Israel
Trump
Ceasefire
White House
Islamabad

More Telugu News