స్మృతి, పలాశ్ ఒకటి కానున్నారా.. ఇరు కుటుంబాల భేటీ!

Smriti Mandhana and Palash Muchhal to Unite Families Meet
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్, స్మృతి మంధాన త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారా.. బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగనుందా.. అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా దృశ్యాలు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న స్మృతి, పలాశ్ ఇటీవల పెళ్లికి సిద్ధపడిన విషయం తెలిసిందే. అయితే, వారి మధ్య విభేదాలు పొడసూపడంతో ఆ వివాహం ఆగిపోయింది. ఆ తర్వాత స్మృతి, పలాశ్ విడిపోయారని ప్రచారం జరిగింది.

ఇందుకు తగ్గట్లే సోషల్ మీడియాలో వారు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అయితే, తాజాగా ఇరు కుటుంబాలు కలిసిపోయాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ వార్తలకు బలం చేకూరుస్తూ, ఇరు కుటుంబాలు కలిసిన ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ప్రైవేట్ వేడుకలో స్మృతి, పలాశ్ కుటుంబ సభ్యులు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం కనిపించింది. దీంతో వీరి పెళ్లి ముహూర్తాలపైనే చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది.

Go Back to Shorts
Smriti Mandhana
Palash Muchhal
Smriti Mandhana marriage
Palash Muchhal wedding
Indian women cricket
Bollywood music director
Smriti Palash families meet
Cricket news
Entertainment news
Celebrity wedding

More Telugu News