హైదరాబాద్‌లో రూ.64.35 లక్షల డ్రగ్స్ స్వాధీనం

హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. చిలకలగూడ, ఆదిభట్ల, సనత్ నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి, రూ.64.35 లక్షల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.

ఈ ఆపరేషన్‌లో డ్రగ్స్‌తో పాటు రూ.50,000 నగదు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితులు గతంలో ఉద్యోగాలు చేశారని, ఆ తర్వాత టైల్స్ వ్యాపారం నిర్వహించినట్లు చెప్పారు. ఈ వ్యాపారంలో నష్టం రావడంతో ఆ తర్వాత డ్రగ్స్ వ్యాపారంలోకి వచ్చారని చెప్పారు.

Hyderabad Drugs Seizure
Hyderabad
Drugs
వైభవ్ గైక్వాడ్
Vaibhav Gaikwad
Chilkalguda
Adibatla

More Telugu News