5 కిలోల గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం తీపికబురు
- గ్యాస్ సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం
- 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరా రెట్టింపు చేయాలని నిర్ణయం
- ఓఎంసీల ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని సూచించిన కేంద్రం
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో 5 కిలోల బరువుండే 'ఛోటు' సిలిండర్లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పట్టణాలు, నగరాలలో నివసించే వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఈ సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ గ్యాస్ కనెక్షన్లకు అడ్రస్ ప్రూఫ్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే 5 కిలోల సిలిండర్‌ను పొందవచ్చు.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ కొరత లేకుండా చూడటం, వలస కార్మికులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు గ్యాస్ కొనాల్సిన అవసరం లేకుండా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చమురు రంగ కంపెనీల ద్వారా ఈ అదనపు సరఫరాను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలని కేంద్రం నిర్ణయించింది.