Mahindra Scorpio: నడిరోడ్డుపై మహీంద్రా ఎస్‌యూవీ కార్లతో ఢీకొడుతూ గందరగోళం

గురుగ్రామ్‌లో ఇద్దరు స్నేహితులు తమ ఎస్‌యూవీ కార్లను ఒకదానితో మరొక దానిని ఢీకొడుతూ గందరగోళం సృష్టించారు. ఈ ఘటన గురుగ్రామ్‌లోని ధన్వాపూర్‌లో చోటు చేసుకుంది. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. రద్దీగా ఉండే రోడ్డుపై రెండు ఎస్‌యూవీ వాహనాలలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారు నడిరోడ్డుపై ఒక వాహనంతో మరొక వాహనాన్ని ఢీకొట్టారు.

రెండు కూడా నలుపు రంగు మహీంద్రా స్కార్పియో వాహనాలు. ఇరువురి మధ్య వాగ్వాదం కారణంగా నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను చూసిన వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎస్‌యూవీ వాహనాలు పరస్పరం ఢీకొట్టుకుంటుండగా, అదే రోడ్డుపై వెళుతున్న వాహనదారులు భయంతో తమ వాహనాల వేగాన్ని తగ్గించుకుని పక్క నుంచి వెళ్లారు.

ఒకానొక సమయంలో ఎస్‌యూవీలు ఢీకొంటున్న సమయంలో ఒక ద్విచక్ర వాహనదారుడు తృటిలో తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరు స్నేహితులను స్థానిక రాజేంద్ర పార్క్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.
Mahindra Scorpio
Gurugram road rage
SUV collision
road accident Gurugram
Dhanwapur incident

More Telugu News