Iran: ఒక్క దెబ్బకు 8 టార్గెట్లు.. గల్ఫ్ దేశాలను వణికిస్తున్న ఇరాన్ హిట్‌లిస్ట్

ఇరాన్‌లోని అతిపెద్ద, అత్యంత కీలకమైన వంతెనను అమెరికా ధ్వంసం చేసిందన్న వార్తల నేపథ్యంలో.. ప్రతీకార చర్యలకు దిగుతామంటూ టెహ్రాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లోని 8 ప్రధాన వంతెనలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఓ 'హిట్‌లిస్ట్'ను విడుదల చేసింది.

ఇరాన్‌లోని B1 వంతెనపై అమెరికా దాడులు జరిపిందని, అది కూలిపోయిందని వార్తలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "ఇంకా ముందుంది" (More to follow) అని హెచ్చరించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. దీనికి ప్రతిస్పందనగానే ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ హిట్‌లిస్ట్‌ను ప్రకటించింది.

ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న వంతెనల జాబితాలో గల్ఫ్ ప్రాంతంలోని అత్యంత వ్యూహాత్మకమైన నిర్మాణాలు ఉన్నాయి. వాటిలో సౌదీ అరేబియా-బహ్రెయిన్‌లను కలిపే కింగ్ ఫహద్ కాజ్‌వే, అబుదాబిలోని షేక్ జాయెద్ బ్రిడ్జ్, దోహాలోని కతారా బ్రిడ్జ్, కువైట్‌లోని షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా కాజ్‌వే ఉన్నాయి. వీటితో పాటు ఒమన్, ఇతర గల్ఫ్ దేశాల్లోని మరికొన్ని కీలక వంతెనలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వంతెనలపై దాడి జరిగితే గల్ఫ్ దేశాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించిపోవడమే కాకుండా ప్రపంచ చమురు సరఫరా, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా తమ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే, తాము కూడా గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాల వంతెనలను ధ్వంసం చేస్తామని ఇరాన్ పరోక్షంగా హెచ్చరించినట్లయింది. 
Iran
Iran hitlist
Gulf countries
King Fahd Causeway
Sheikh Zayed Bridge
Katara Bridge
Sheikh Jaber al-Ahmad al-Sabah Causeway
US Iran tensions
Middle East conflict
oil supply

More Telugu News