Mandipalli Ramprasad Reddy: ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సులపై ఏపీ మంత్రి మండిపల్లి వ్యాఖ్యలు

Mandipalli Ramprasad Reddy Comments on Buses Registered in Other States
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో టూరిస్ట్ బస్సుల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్రైమాసిక పన్నును భారీగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల్లో నమోదై ఉన్న బస్సులను ఏపీకి బదిలీ చేసుకునేలా యజమానులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి నిన్న మంత్రి వీడియో సమావేశం నిర్వహించారు. రవాణాశాఖ ఉన్నతాధికారులు, అఖిల భారత పర్యాటక బస్సుల యజమానుల సంఘం సభ్యులతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఒక్కో సీటుకు రూ.4,000గా ఉన్న త్రైమాసిక పన్నును రూ.2,500కు తగ్గిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల బస్సు నిర్వాహకులతో పాటు ప్రయాణికులకు కూడా ప్రయోజనం కలుగుతుందని మంత్రి వివరించారు.

పన్ను తగ్గింపుతో పాటు బస్సుల్లో భద్రతా వ్యవస్థలను పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. వాహనాల ఫిట్‌నెస్‌ను నిర్ధారించడానికి, ప్రమాదాలను నియంత్రించడానికి క్రమం తప్పకుండా తనిఖీలు చేయిస్తామన్నారు. బస్సు యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సీనియర్ అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
 
Go Back to Shorts
Mandipalli Ramprasad Reddy
Andhra Pradesh
AP Transport Minister
Tourist Buses
Bus Owners
Quarterly Tax
Tax Reduction
Road Safety
Bus Registration

More Telugu News