Vijay: రూ.404 కోట్ల ఆస్తులు, ఖరీదైన కార్లు: అఫిడవిట్‌లో పేర్కొన్న విజయ్

Vijay Declares Assets Worth Rs 404 Crore in Affidavit
షార్ట్స్‌లో చూడండి
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులను రూ.404.58 కోట్లుగా చూపించారు. అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు మొత్తం రూ. 4,04,58,57,196గా ఉంది. బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, వాహనాలు, ఇతర చరాస్తులతో సహా ఆయన ఆర్థిక వివరాలను ఈ అఫిడవిట్‌లో వివరంగా పొందుపరిచారు.

తన వద్ద నగదు రూపంలో రూ.2 లక్షలు, భార్య సంగీత వద్ద రూ.1 లక్ష ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ.388 కోట్లు ఉన్నట్లు తెలిపారు. తన వద్ద బీఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్‌ఫైర్ వంటి ఖరీదైన కార్లతో పాటు ఇతర ఆటోమొబైల్స్, ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయని పొందుపరిచారు. వాహనాల మొత్తం విలువ రూ.14.35 కోట్లుగా పేర్కొన్నారు.

తన వద్ద 883 గ్రాముల బంగారం, దాని విలువ రూ.1.20 కోట్లు ఉంటుందని వెల్లడించారు. రూ.15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు వెల్లడించారు. తనవద్ద ఉన్న స్థిరాస్తుల్లో తాను కొన్నవాటితో పాటు, వారసత్వంగా వచ్చినవి కూడా ఉన్నాయని వెల్లడించారు. స్వయం ఉపాధి, వడ్డీ, ఆస్తుల నుంచి వచ్చే అద్దె తన ప్రధాన ఆదాయవనరు అని పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 184.53 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు విజయ్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Vijay
Vijay TVK
Tamil Nadu Politics
Actor Vijay Assets
Vijay Election Affidavit
Vijay Cars
Vijay Property

More Telugu News