రామ్‌చరణ్ రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు: 'పెద్ది' సినిమా టీమ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ గాయపడిన ఘటనపై 'పెద్ది' సినిమా టీమ్ స్పందించింది. ప్రస్తుతం రామ్‌చరణ్ కోలుకుంటున్నారని తెలిపింది. చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్‌లో ఆయన కుడి కంటికి స్వల్పగాయమైనట్లు తెలిపింది. ఈ గాయానికి గాను చికిత్స తీసుకున్నట్లు వెల్లడించింది.
రామ్‌చరణ్‌కు అయిన గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అభిమానులకు సూచించింది. ఈ గాయంపై ఎలాంటి అనవసర ప్రచారాలను నమ్మవద్దని కోరింది. ఈ గాయం నుంచి కోలుకుంటున్న రామ్‌చరణ్ రేపు చిత్రీకరణలో పాల్గొంటారని వెల్లడించింది.
రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుండగా స్వల్పగాయమైంది. గాయమైనచోట నాలుగు కుట్లు పడినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని భావిస్తున్నారు.