భాగ్యనగరంలో ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త
భాగ్యనగరంలో ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నగర పరిధిలోని మెట్రో, ఏసీ డీలక్స్ బస్సుల్లో 30 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ కొరత వార్తల నేపథ్యంలో ప్రయాణికులకు ఆర్టీసీ ఊరటనిచ్చే వార్త చెప్పింది.
ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పందిస్తూ, "పెట్రోల్ కష్టాలు పడటం ఎందుకు దండగ, ఆర్టీసీ బస్సులు ఉండగ" అంటూ వ్యాఖ్యానించారు. పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు బారులు తీరవద్దని, సురక్షితంగా బస్సులోనే ప్రయాణించాలని సూచించారు.