రామ్‌చరణ్ త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్
'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ నటుడు రామ్‌చరణ్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. సినిమా చిత్రీకరణ సందర్భంగా రామ్‌చరణ్ గాయపడ్డారని తెలిసిందని పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు జనసేన పార్టీ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసింది.
రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. చిత్రీకరణ సందర్భంగా రామ్‌చరణ్‌కు స్వల్పగాయమైంది. ఆయన కంటి సమీపంలో చిన్న గాయం అయినట్లు తెలుస్తోంది. చిన్న గాయమేనని, కొన్నిరోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తెలుస్తోంది. రామ్‌చరణ్ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.