గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు మరోసారి పెంపు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, చమురు కంపెనీలు గ్యాస్ సరఫరా కోసం కొత్త నిబంధనలను తీసుకువస్తున్నాయి. రెండు సిలిండర్లు ఉన్న వారికి ఇకపై 35 రోజులకు ఒక గ్యాస్ సిలిండర్ లభించనుంది. అదే సమయంలో, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఉన్న వినియోగదారులకు ప్రతి 45 రోజులకు ఒక సిలిండర్ అందుతుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఇదే నిబంధన వర్తిస్తుంది.
డబుల్ సిలిండర్ వినియోగదారులకు రీఫిల్ బుకింగ్ మధ్య అంతరాన్ని మరింత పెంచుతూ చమురు సంస్థలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. మొదట్లో ఈ గడువు 21 రోజులు ఉండగా, మార్చి రెండో వారంలో 25 రోజులకు పెంచిన చమురు సంస్థలు, తాజాగా 35 రోజులకు సవరించాయి. సింగిల్ సిలిండర్ ఉంటే పట్టణాల్లో 25 రోజుల తర్వాత, గ్రామాల్లో 45 రోజుల తర్వాత బుక్ చేయాల్సి ఉంటుంది.