నకిరేకల్-ఏర్పేడు హైవే పూర్తి.. తెలంగాణ నుంచి తిరుపతికి కొత్త దారి
తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డు మార్గంలో ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ మరో కీలకమైన జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలోని నకిరేకల్ నుంచి ఏపీలోని తిరుపతి సమీపంలో ఉన్న ఏర్పేడు వరకు నిర్మించిన జాతీయ రహదారి-565 (NH-565) ఇప్పుడు పూర్తిగా రాకపోకలకు సిద్ధమైంది. ఈ కొత్త రహదారి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65)ని, మదనపల్లె-నాయుడుపేట జాతీయ రహదారి (NH-71)తో అనుసంధానిస్తుంది. దీంతో తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు ఇది ఒక సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడనుంది.
దాదాపు 420 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారిలో ఎక్కువ భాగం ఏపీలోనే ఉంది. తెలంగాణలోని నకిరేకల్, నల్గొండ, దేవరకొండ ప్రాంతాలను దాటిన తర్వాత పల్నాడు జిల్లా మాచర్ల వద్ద ఈ హైవే ఏపీలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి యర్రగొండపాలెం, మార్కాపురం, పొదిలి, కనిగిరి, రాపూరు, వెంకటగిరి మీదుగా ప్రయాణించి ఏర్పేడు వద్ద ముగుస్తుంది. ఏర్పేడు వద్ద ఎడమవైపు వెళ్తే శ్రీకాళహస్తికి, కుడివైపు తిరిగితే తిరుపతికి చేరుకోవచ్చు.
ఈ రహదారి నిర్మాణం ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వాసులకు ఎంతో ఊరటనిచ్చింది. గతంలో యర్రగొండపాలెం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే పుల్లలచెరువు, వెల్దుర్తి మండలాల మధ్య ఉన్న అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణం నరకాన్ని తలపించేది. ఘాట్ రోడ్డు అధ్వానంగా ఉండటంతో 20 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడానికి దాదాపు 50 నిమిషాలు పట్టేది. అయితే, ఇప్పుడు జాతీయ రహదారి నిర్మాణంతో ఆ కష్టాలు తీరిపోయాయి. రూ.393 కోట్ల వ్యయంతో ఈ మార్గాన్ని అభివృద్ధి చేయడంతో కేవలం 20 నిమిషాల్లోనే ఆ దూరాన్ని చేరుకోవచ్చు. ఘాట్ రోడ్డు కావడంతో ఈ మార్గంలో 16 వంతెనలు, 8 అండర్‌పాస్‌లు నిర్మించారు. అటవీ అనుమతుల వంటి అడ్డంకులు ఎదురైనా, పనులను వేగంగా పూర్తిచేసి గడువు కంటే ముందే అందుబాటులోకి తేవడం విశేషం. ఈ మార్గం కడప జిల్లాలోని పోరుమామిళ్ల ప్రాంత ప్రజలు హైదరాబాద్ వెళ్లడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కొండలు, లోయల మధ్య నిర్మించిన ఈ రహదారి ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది.