ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు: శర్వానంద్
యువ హీరో శర్వానంద్ తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆదివారం జరిగిన తన కొత్త సినిమా ‘బైకర్’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంచి సినిమాలు రావాలన్నా, నిర్మాణ వ్యయం అదుపులో ఉండాలన్నా నిర్మాతల పాత్ర చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
సినిమా నిర్మాణంలో నిర్మాత క్రియాశీలత గురించి శర్వానంద్ వివరిస్తూ, "నిర్మాతలు స్క్రిప్టు దశ నుంచి ప్రతిరోజూ సెట్‌కు వచ్చి దగ్గరుండి పనులు చూసుకుంటే ప్రొడక్షన్ ఖర్చు పెరగదు. అప్పుడే మంచి సినిమాలు తీయగలం" అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘శతమానం భవతి’ సినిమాకు నిర్మాత దిల్ రాజు దగ్గరుండి పాటలు రాయించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. దిల్ రాజులాగే యూవీ క్రియేషన్స్ వంశీ, నిర్మాత బన్నీ వాసు కూడా తమ సినిమాల పట్ల ఎంతో డెడికేషన్‌తో పనిచేస్తారని శర్వానంద్ ప్రశంసించారు.
నిర్మాతలు హీరోల వెనకుండి, మంచి కథలతో బడ్జెట్‌లో సినిమాలు తీసి డబ్బులు సంపాదిస్తే అందరూ బాగుంటారు. హీరోలకు కూడా అది చాలా సంతోషాన్నిస్తుందన్నారు. నిర్మాతలందరూ ఈ పద్ధతి పాటిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని ఆయన సూచించారు.