రామ్ చరణ్ 'పెద్ది'లో మృణాల్ ఠాకూర్ ఐటమ్ సాంగ్..?

 ‌గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'పెద్ది' సినిమాపై ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ స్పెషల్ సాంగ్‌లో మృణాల్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని కొందరు అంటుండగా, కేవలం ఆమె మాత్రమే ఉంటుందని మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ప్రస్తుతం 'పెద్ది' చివరి దశ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో శరవేగంగా ముందుకు సాగుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


More Telugu News